దేశంలో 15 మందికి మోదీ కాపలా కాస్తున్నారు: రాహుల్ గాంధీ

  • దేశానికి కాపలాదారుడిగా ఉంటానన్న మోదీ.. దొంగగా మారారు
  • దేశంలో అన్ని చోట్ల ఆత్మహత్యలే కనిపిస్తున్నాయి
  • మోదీ, కేసీఆర్ ల పాలనకు చరమగీతం పాడాలి
ప్రధాని మోదీ కార్పొరేట్లకు మాత్రమే న్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాఫెల్ స్కాం ద్వారా తన మిత్రుడు అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లు కట్టబెట్టారని అన్నారు. దేశ ప్రజలను మోదీ నడిరోడ్డుపై నిలబెట్టారని అన్నారు. యూపీయే హయాంలో పేద ప్రజల కోసం తాము ఎంతో చేశామని చెప్పారు. దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన మోదీ... ఎవరికి కాపలా ఉన్నారని ప్రశ్నించారు. అంబానీలు, అదానీల వంటి 15 మంది కార్పొరేట్లకు ఆయన కాపలాదారుడిగా ఉన్నారని అన్నారు. దేశానికి కాపలా కాస్తానని చెప్పిన మోదీ... దొంగలా మారారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

దేశంలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు.  రాబోయే ఎన్నికల్లో మోదీ, కేసీఆర్ ల పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... ఏక కాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. 
Go Back to Shorts
Rahul Gandhi
kcr
modi
bhainsa
congress

More Telugu News